సమీక్ష 2 : స్టైల్ ఎక్కువై విషయం తగ్గిన పంజా

సమీక్ష 2 : స్టైల్ ఎక్కువై విషయం తగ్గిన పంజా

Published on Dec 9, 2011 4:58 PM IST
విడుదల తేది : 09 డిశంబర్ 2011
123 తెలుగు .కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : విష్ణు  వర్ధన్
నిర్మాత : శోభు యార్లగడ్డ , నీలిమ తిరుమలశెట్టి, నగేష్
సంగిత డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
తారాగణం : పవన్ కళ్యాణ్, సారా జేన్ డియాస్, అంజలి లవనియా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ స్టైలిష్ డైరెక్టర్ విష్ణువర్ధన్ పంజా తో మన ముందుకి వచ్చారు. వీరిద్దరూ కలిసి ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయగలిగారా లేదా ఇప్పుడు చూద్దాం.

కథ:

భగవాన్ (జాకీ ష్రాఫ్) కోల్కతా లో ఉండే ఒక మాఫియా డాన్. తన అసోసియేట్స్ గురు (తనికెళ్ళ భరణి), సభాపతి (పరుచూరి వెంకటేశ్వర రావు) జై (పవన్ కళ్యాణ్) సహాయంతో మాఫియా సామ్రాజ్యాన్ని తన గుప్పిట్లో ఉంచుకుంటారు. భగవాన్ కొడుకు గ్యాంగ్ లోకి రావడంతో పరిస్థితి మారిపోతుంది. భగవాన్ శాడిస్ట్ కొడుకైన మున్నాకి సభాపతితో గొడవతో భగవాన్ గ్యాంగ్ మద్య అగాధం ఏర్పడుతుంది. మున్నా క్లబ్ డాన్సర్ అయిన జాహ్నవి (అంజలి లవనియా) ని కోరుకోవడం, జాహ్నవి జై ని ఇష్టపడటంతో మున్నా జహ్నవిని చంపేస్తాడు. మున్నాతో గొడవలో మున్నా ని జై చంపేస్తాడు. భగవాన్ జై తో గొడవ జరిగాక తన ప్రియురాలు సంధ్య (సారా జేన్ డియాస్) తో కలిసి జై కోల్కత వదిలి వెళ్ళిపోతాడు. జై ఎక్కడికి వెళ్ళాడు, భగవాన్ గ్యాంగ్ తరువాత ఎం చేసింది అనేది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

పవన్ కళ్యాణ్ అధ్బుతమైన నటన కనబరిచాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ మరియు కీలక సన్నివేశాల్లో అతను చాల బాగా చేసాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతను బాగా చేసాడు. జాకీ ష్రాఫ్, తనికెళ్ళ భరణి, అతుల్ కులకర్ణి విలన్స్ గా బాగానే చేసారు. భగవాన్ శాడిస్ట్ కొడుకుగా అడివి శేష్ పాత్ర చాలా బాగా చేసాడు. అతని పాత్ర ఇంకాస్త
పెంచి ఉంటె బావుండేది. అంజలి లవనియా క్లబ్ డాన్సర్ గా తన మొదటి సినిమాలో చిన్న పాత్రలో నటించింది. పవన్ కళ్యాణ్ మరియు సారా జేన్ డియాస్ మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా తీసారు. తను చాలా అందంగా ఉండటమే కాకుండా మంచి నటనని కనబరిచింది. ఈ నటులందరితో డైరెక్టర్ విష్ణువర్ధన్ మంచి నటన రాబట్టుకున్నాడు.

మైనస్ పాయింట్స్:

సినిమా ఫస్టాఫ్ ని స్టైలిష్ గా తీసిన దర్శకుడు సెకండాఫ్ లో మాత్రం కథ సరిగా లేక పేలవంగా మారిపోయింది. సినిమా కథ అంతా ఫస్టాఫ్ లోనే చెప్పేసాడు. బ్రహ్మానందం కామెడీ పార్ట్ ఒక్కటే సెకండాఫ్ కి ప్రాణం. పాటలు కూడా సరైన టైమింగ్ లేక ఏదోలా ఉన్నాయి. టైటిల్ సాంగ్ కూడా చివర్లో పెట్టి ఫాన్స్ ని నిరాశ పరిచాడు. పవన్ కళ్యాణ్ పాత్ర మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా కాకుండా డిఫరెంట్ గా మలచడం తో సాధారణ ప్రేక్షకుడికి రుచించకపోవచ్చు.

సాంకేతిక విభాగం:

డైరెక్టర్ విష్ణువర్ధన్ ప్రతి పాత్రని మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. అతను కథను నడిపిన విధానం చాలా బావుంది.సినిమాటోగ్రాఫర్ పిఎస్. వినోద్ నుండి మంచి సహకారం లభించింది. ప్రతి ఫ్రేం కొత్తగా ఉంటుంది. యువన్ శంకర్ రాజా నేపధ్య సంగీతం చాలా బావుంది. పాటలు పర్వలేదనిపిస్తాయి. అంజలి లవనియా చేసిన ఐటెం సాంగ్ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. అబ్బూరి రవి రాసిన డైలాగులు చాలా బావున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.

తీర్పు:

ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళ్తే మీకు నచ్చవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రం పవన్ కళ్యాణ్ నుండి రెగ్యులర్ గా ఆశించే మసాలా అంశాలు లేకపోవడంతో కొంత నిరాశ పరచవచ్చు.

అశోక్ రెడ్డి . ఎం

123తెలుగు.కాం రేటింగ్: 3/5

Panjaa Review For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు