వరుస ప్రాజెక్ట్‌లతో నాని డైరీ ఫుల్.. అయితే..!

వరుస ప్రాజెక్ట్‌లతో నాని డైరీ ఫుల్.. అయితే..!

Published on Mar 30, 2026 10:00 PM IST

Nani 3

న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా ‘కోర్ట్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఆయనకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, నాని తన ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై వరుసగా మూడు కొత్త సినిమాలను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు.

మొదటి ప్రాజెక్ట్ కోసం ‘కోర్ట్’ దర్శకుడు రామ్ జగదీష్‌తోనే నాని చేతులు కలిపాడు. ఈ సినిమాలో హీరోగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే, ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ చెప్పిన కథ నానికి బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ హీరోగా నటించే ఛాన్స్ ఉంది.

వీటితో పాటు, నాని తన సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో కూడా ఒక సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్నాయి. త్వరలోనే నాని ఈ ప్రాజెక్టుల గురించి అధికారికంగా ప్రకటించనున్నాడు.

తాజా వార్తలు