సమీక్ష : “డిస్కో” : ప్రేక్షకుల సహనానికి పరీక్ష

సమీక్ష : “డిస్కో” : ప్రేక్షకుల సహనానికి పరీక్ష

Published on Apr 20, 2012 7:45 PM IST
 
విడుదల తేది : 20 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 1.5/5
దర్శకుడు : హరి కె చందూరి
నిర్మాతలు : మాచ రామలింగా రెడ్డి, కె అభినవ్ రెడ్డి
సంగీత దర్శకుడు: ఆనంద్
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ, సారా శర్మ

నిఖిల్ మరియు సారా శర్మ మొదటి సారిగా కలిసి నటించిన చిత్రం “డిస్కో”. హరి కే చందూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామ లింగా రెడ్డి మరియు అభినవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే విడుదలయ్యింది ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

డిస్కో(నిఖిల్) ఒక అనాథ, అతనికి ముగ్గురు స్నేహితులు (ఖయ్యుం,విజయ్ సాయి, హ్యాపీ డేస్ పైడితల్లి). డిస్కో ప్రతి సారి చేసే అల్లరి పనులకు స్నేహితులు ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అలాంటి డిస్కో షైనీ(సారా శర్మ) తో ప్రేమలో పడతాడు ఆమెను వెతుక్కుంటూ బ్యాంకాక్ కి కూడా వెళతాడు. షైనీ లోకల్ డాన్ (ఆశిష్ విద్యార్థి) కూతురని తెలుస్తుంది.

డిస్కో షైనీ ప్రేమను గెలుచుకున్న తరువాత కథలో ముఖ్యమయిన మలుపులు చోటు చేసుకుంటుంది. స్నేహమా ప్రేమా అన్న సందిగ్ధం లో కథ ప్రవేశిస్తుంది. తరువాత ఏమయింది? డిస్కో ప్రేమను గెలుచుకున్నడా? లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ :
ఎం.ఎస్ నారాయణ సూర్య భాయ్ పాత్రలో చాలా బాగా నవ్వించారు. మహేష్ బాబు బిజినెస్ మాన్ పాత్రలో ఎం ఎస్ నారాయణ చాలా అద్బుతంగా నటించారు.చిత్రంలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఇదే. అలీ పాత్ర రెండవ అర్ధ భాగంలోనే ఉంది ఈ పాత్ర చాలా బాగా వచ్చింది. రఘు బాబు తనవంతు ప్రయత్నం చేసిన పాక్షికంగానే సఫలం అయ్యారు. బుల్లి తెర కార్యక్రమాల మీద చేసిన హాస్యం పరవాలేదనిపించింది.

మైనస్ :

చిత్ర కథ మరియు కథనం అసలు బాగోలేవు కథ చెప్పిన విధానం దారుణం. చిత్రంలో లాజిక్ ఏమాత్రం కనపడదు ఏదయినా మంచి సన్నివేశం వస్తుందేమో అని ప్రేక్షకుడు వెయ్యి కళ్ళతో వేచి చూస్తుంటాడు. దర్శకత్వం బాగోలేదు నటనా పరంగా ఎవరి ప్రదర్శన ఆకట్టుకోదు. నిఖిల్ పవన్ కళ్యాణ్ మరియు రవితేజ లను అనుకరించడం చిరాకు కలిగిస్తుంది సారా శర్మ కాస్త్త్త నటన నేర్చుకొని నటిస్తే బాగుండేది.

చిత్రం లో దిగజారిన హాస్యాన్ని ప్రయత్నించారు ఇది నవ్వించకపోగా చిరాకు కలిగిస్తుంది. ఆశిష్ విద్యార్థి పాత్రను సరిగ్గ్గా తీర్చి దిద్దలేదు అలానే జీవ పాత్ర సంపూర్ణంగా అనిపించదు. చిత్రంలో కారణం లేకుండా సెంటిమెంట్ సన్నివేశాలు వస్తాయి. రెండవ అర్ధ భాగం అంతా అర్ధం లేని మలుపులతో సాగుతుంది. రెండవ అర్ధం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష. చిత్రం చాలా పొడవు.

చిత్ర క్లైమాక్స్ కి అసలు అర్ధం లేదు ఆశిష్ విద్యార్థి ఎందుకు మారిపోతాడో సరయిన కారణం చూపించలేదు. చిత్రం లో ఇంకా చాలా తప్పులున్నాయి కాని అవన్నీ చెప్పి మీ విలువయిన సమయాన్ని వృధా చెయ్యదలుచుకోలేదు.

సాంకేతిక అంశాలు :

చిత్ర రీ-రికార్డింగ్ అసలు బాగోలేదు ప్రత్యేకంగా పాటల సమయంలో. మంత్ర ఆనంద్ సంగీతం ఆకట్టుకోలేక పోయింది.. ఎడిటింగ్ ఇంకా బాగా ఉండాల్సింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నా పలు చోట్ల బాగోలేదు. సినిమాటోగ్రఫీ పరవాలేదు. హరి చందూరి దర్శకత్వం బాగోలేదు.

తీర్పు :
డిస్కో చిత్రాన్ని చూడకపోవడమే మంచింది. నటన బాగోలేదు, దర్శకత్వం బాగోలేదు, ఓపికను పరీక్షించే సన్నివేశాలు, చిత్ర నిడివి ఎక్కువగా ఉండటం, మీ సమయం వృధా చేసుకోవాలి అనుకుంటే ఈ చిత్రాన్ని చుడండి.

123తెలుగు.కాం రేటింగ్ : 1.5/5

అనువాదం : – రవి

Clicke Here For ‘Disco ’ English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు