సమీక్ష : ప్రతినిధి – కాన్సెప్ట్ కేక, టేకింగ్ యావరేజ్

సమీక్ష : ప్రతినిధి – కాన్సెప్ట్ కేక, టేకింగ్ యావరేజ్

Published on Apr 26, 2014 2:30 AM IST
 Pratinidhi విడుదల తేదీ : 25 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : ప్రశాంత్ మండవ
నిర్మాత : జె. సాంబశివరావు
సంగీతం : సాయి కార్తీక్
నటీనటులు: నారా రోహిత్, శుభ్ర అయ్యప్ప, శ్రీ విష్ణు..

ఎన్నికల వేల, మన రాజకీయాలకు సంబంధిచిన కథతో వస్తున్న సినిమా ‘ప్రతినిధి’. నారా రోహిత్ నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ:

శ్రీను (నారా రోహిత్), రాజకీయ అవినీతితో విసుగు చెందిన ఒక వ్యక్తి. దంతి శ్రీను ముఖ్యమంత్రి (కోట శ్రీనివాస్ రావు)ని కిడ్నాప్ చేసి తన భావాలను ప్రజలకు చెప్పలనుకుంటాడు. దీనికోసం మంత్రి (గిరిబాబు) కొడుకైన శ్రీకర్ (శ్రీ విష్ణు) సహాయం తీసుకుంటాడు. శ్రీను ఒక మంచి ప్రణాళికతో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. ఈ కిడ్నాప్, దేశం అంతటా సంచలనం రేపుతుంది. పోలీస్ కమీషనర్ (పోసాని కృష్ణ మురళి) కిడ్నాపర్ తో సంప్రదింపులు జరుపుతాడు. ముఖ్యమంత్రిని విడుదల చేయడానికి శ్రీను కొన్ని ఆసక్తి కరమైన డిమాండ్లు కమీషనర్ ముందుంచుతాడు.

ప్రస్తుతం ఉన్న ఐదు వందల మరియు వేయి రూపాయల నోట్లని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతాడు, వాటి స్థానంలో మరో కొత్త రూపంలో నోట్లను ముద్రించాలని డిమాండ్ చేస్తాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు వెళ్ళే విధానంలో స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తాడు. ప్రజలు, మీడియా శ్రీనుకి మద్దతు తెలుపుతారు, కానీ పోలీసులు కొన్ని నిజాలు దాస్తారు. అయితే కిడ్నాపర్ నిజంగా శ్రీను ఏనా? లేక అతడు ఒక దెయ్యమా? ఈ
కిడ్నాప్ లో శ్రీకర్ చేసిన సహాయం ఏంటి? అన్నదే ఈ సినిమా కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

నారా రోహిత్, రాజకీయాలతో విసుగు చెందిన ఒక యువకుడి పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. తన డైలాగ్ డెలివరీ కూడా చాలా మెరుగైంది. కోట శ్రీనివాస్ రావు, ముఖ్యమంత్రి పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సినిమా మొదట్లో కిడ్నాప్ చేసినప్పుడు కోపం ప్రదర్శించే ఆ పాత్ర చివరకు జరిగన విషయాలను తెలుసుకొని మారే విధానంలో మంచి నటనని కనబరిచాడు. పోసాని కృష్ణ మురళి పోలీస్ కమీషనర్ పాత్రలో మంచి కామెడిని పండించాడు.

ప్రతి సినిమాతో తన నటనను మెరుగు పరుచుకుంటున్న శ్రీ విష్ణు తన పాత్రకు న్యాయం చేశాడు. రొటీన్ పాత్రలో కనిపించన జయప్రకాశ్ రెడ్డి మరియు రవి ప్రకాష్ లు పర్వాలేదు అనిపించుకున్నాడు. రాజకీయ సన్నివేశాలు మరియు ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది. కొన్ని డైలాగులు ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టిస్తాయి. సినిమా చిన్నగా ఉండడం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

భారీ భద్రతతో ఉండే ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేయడం అంత సులబమైన విషయం కాదు. దీనిని ఇంకాస్త వాస్తవంగా చూపించి ఉంటే బాగుండేది. పోలీస్ డిపార్ట్ మెంట్ ని కూడా చేతకాని వారిలా చూపించారు.

హీరో హీరోయిన్ ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ చాలా బోరింగ్ గా ఉన్నాయి, అలాగే వారి మధ్య వచ్చే ఒక పాట సినిమాకి అవసరం లేదు. హీరోయిన్ శుభ్ర అయ్యప్ప పేలవమైన నటన కనబరిచింది. సినిమాలో ప్రత్యేకంగా కామెడీ ట్రాక్ లేనందున, బి, సి సెంటర్స్ లో ఆడే అవకాశాలు చాలా తక్కువే.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనట్టు ఉంది. ఎడిటర్ కాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. సినిమాకి డైలాగులు మాత్రం చాలా బాగా రాసారు. ప్రశాంత్ మండవ కొన్ని సన్నివేశాలు బాగా తీసినప్పటికీ, అదే టెంపోని పూర్తి సినిమాలో క్యారీ చేయలేకపోయాడు.

తీర్పు :

‘ప్రతినిధి’ కథ బాగునప్పటికీ పూర్తి సినిమా మాత్రం పర్వాలేదు అనిపించుకుంది. దీనికి ముఖ్య కారణం హీరోయిన్, కొన్ని అనవసరమైన సన్నివేశాలు మరియు స్క్రిప్ట్ ని తను అనుకునట్టు తీయడంలో దర్శకుడు విఫలమవడం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఈ సినిమాకి లాబాలు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమాలో కామెడీ లేనందున విదేశాలలో మాత్రం సినిమాకు పెద్ద లాభాలు ఉండకపోవచ్చు.

123తెలుగు. కామ్ రేటింగ్ :3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు