మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రమే “డ్రాగన్”. సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రం భారీ బడ్జెట్ తో ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూట్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇపుడు బయటకి వచ్చింది. ,మేకర్స్ రీసెంట్ గానే జోర్డాన్ లో సినిమాకి సంబంధించిన కీలక షూట్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
అక్కడ ఈ సినిమాకి రోజుకి ఈజీగా కోటి నుంచి కోటిన్నర ఖర్చు అయినట్టు మేకర్స్ తెలిపారు. ఆ షెడ్యూల్ ఎక్స్ట్రార్డినరీగా వచ్చిందని తాము తెలిపారు. మరి రోజుకి అంత రేంజ్ లో అంటే సినిమా అవుట్ పుట్ ఏ లెవెల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ ఉండొచ్చు.


