విడుదల తేదీ : మార్చి 19, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.75/5
నటీనటులు : రణవీర్ సింగ్, సంజయ్ దత్, R. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్
దర్శకుడు : ఆదిత్య ధర్
నిర్మాతలు : ఆదిత్య ధర్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్
సంగీత దర్శకుడు : శాశ్వత్ సచ్‌దేవ్
సినిమాటోగ్రాఫర్ : వికాష్ నౌలాఖా
ఎడిటర్ : శివకుమార్ వి. పనికర్
సంబంధిత లింక్స్ :ట్రైలర్
రణ్ వీర్ సింగ్ మరియు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ తక్కువ అంచనాలతో మొదలై, భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక చరిత్రను సృష్టించింది. మొదటి భాగం భారీ విజయం సాధించాక, ఈ ఫ్రాంచైజీ ఒక ఉద్యమంలా మారింది. ఇప్పుడు ‘ధురంధర్: ది రివెంజ్’ భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. ఈ సీక్వెల్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
రెహమాన్ డకైత్ (అక్షయ్ ఖన్నా) మరణం తర్వాత ల్యారీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. హంజా అలీ మజారీ అలియాస్ జస్కీరత్ సింగ్ రంగీ (రణ్వీర్ సింగ్), ఎస్పీ చౌదరి అస్లాం (సంజయ్ దత్) మరియు అర్షద్ పప్పు (అశ్విన్ దార్) కలిసి రెహమాన్‌ను చంపారని ఉజైర్ బలోచ్ (డానిష్ పాండోర్) నమ్మేలా చేస్తాడు. దీనితో ఉజైర్ అర్షద్ పప్పును చంపేస్తాడు, కానీ అనూహ్య పరిణామాల వల్ల హంజా లియారీని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హంజా గతం ఏమిటి? అనేదే ఈ చిత్ర కథాంశం.
ప్లస్ పాయింట్స్ :
4 గంటల నిడివి ఉన్నప్పటికీ, ఆదిత్య ధర్ తన అద్భుతమైన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇంత లెంగ్త్ లోను ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించడంలో ఆయన విజయం సాధించారు.
రణవీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది.
సినిమాలో వచ్చే ట్విస్టులు ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. దేశభక్తిని చాలా శక్తివంతంగా చూపించారు. ప్రీ-క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు వచ్చే సీన్లు సినిమాకే హైలైట్
.
విలన్‌గా అర్జున్ రాంపాల్ నటన అద్భుతం. సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్ మరియు డానిష్ పాండోర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సినిమాలో కొన్ని రాజకీయ అంశాలు నేరుగా ఉండటం వల్ల కొంతమంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా “ఆపరేషన్ గ్రీన్ లీఫ్” ఎపిసోడ్ చర్చలకు దారితీసే అవకాశం ఉంది.
శాశ్వత్ సచిదేవ్ అందించిన నేపథ్య సంగీతం బాగున్నప్పటికీ, పాటలు మొదటి భాగం అంత స్థాయిలో లేవు. రెండో భాగం ప్రారంభంలో కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం:
వికాస్ నౌలాఖా సినిమాటోగ్రఫీ, శివకుమార్ పనిక్కర్ ఎడిటింగ్ వరల్డ్ క్లాస్ రేంజ్‌లో ఉన్నాయి. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ ఒక స్పై థ్రిల్లర్‌ను ఎలా తీయాలో నేర్పే పాఠ్యపుస్తకంలా ఉంది.
తీర్పు:
ఓవరాల్ గా చెప్పాలంటే.., ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రేక్షకులను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచే ఒక గొప్ప సీక్వెల్. రణవీర్ సింగ్ విశ్వరూపం, ఆదిత్య ధర్ విజన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. కొన్ని రాజకీయ వివాదాలు, రొటీన్ పాటలు పక్కన పెడితే, ఇది తప్పక చూడాల్సిన చిత్రం. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయం.
123telugu.com Rating: 3.75/5
Reviewed by 123telugu Team


