ప్రారంభమైన సుధీర్ బాబు కొత్త చిత్రం షూటింగ్

suder-babau-nandita

సుధీర్ బాబు కొత్త చిత్రం “కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ షూటింగ్ ప్రారంభమైంది. సుధీర్ బాబు ఈ చిత్రంలో నందితతో కలసి స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నాడు. గతంలో వీరివురు ఘనవిజయం సాధించిన ‘ప్రేమ కథ చిత్రం’ లో కలసి నటించారు.

“నా కొత్త చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ షూటింగ్ ప్రారంభించాము. మీ అందరి ఆశీర్వాదం కావలి.” అని సుధీర్ బాబు ట్వీట్ చేసాడు. ఈ చిత్రం ‘చార్మినార్’ అనే కన్నడ చిత్రానికి రీమేక్. కన్నడలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రు తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి సంగీతం అందిస్తున్నారు. నందిత సుధీర్ బాబు తిరిగి ‘ప్రేమ కథ చిత్రం’ కెమిస్ట్రీని సృష్టిస్తారేమో వేచిచూడాలి.

Exit mobile version