
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 12 నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా గురించి నిర్మాత కిరీటి మాట్లాడుతూ, ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి అని, సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 12 నుండి జరుగుతుందని తెలిపాడు. హీరో రామ్ ఎనర్జీ లెవెల్స్ కి తగట్టు ఈ సినిమా ఒక మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.
తమ బ్యానర్ లో ఈ సినిమా మరో సూపర్ హిట్ గా నిలుస్తుందని నిర్మాత కిరీటి భావిస్తున్నారు. అయన ఇంతకు ముందు నిర్మించిన ‘సింహ’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్ గా నిలిచింది. స్టార్ రైటర్ కోనా వెంకట్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.