అక్టోబర్ లో ‘కాంచన’ రీమేక్ ప్రారంభించనున్న లారెన్స్

raghava-lawrence
లారెన్స్ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన ‘కాంచన’ చిత్రాన్ని హిందిలో రీమేక్ చేయబోతున్న సంగతి విదితమే. అయితే తాజా సమాచారం ప్రకారం హింది వెర్షన్ కి కూడా లారెన్స్ దర్శకత్వం వహించనున్నాడు.

ప్రి-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ అన్ని ఖరారైన ఈ చిత్రం అక్టోబర్ నుంచి ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

అంతేకాకుండా ఇంకా పేరు వెల్లడికాని ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడి తో శరత్ కుమార్ పోషించిన పాత్రకోసం చర్చిస్తున్నారని సమాచారం. తెలుగు తమిళ బాషలలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ లారెన్స్ రేంజ్ ని పెంచింది.

Exit mobile version