ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్లనున్న బాలకృష్ణ మూవీ

balakrishna
‘లెజెండ్’ సినిమాతో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఇది కాకుండా ఆయన హీరోగా చేయనున్న మరో సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు అనగా జూన్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సినిమాని శరవేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ సరసన మొదటిసారిగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సత్యదేవా డైరెక్టర్. లెజెండ్ లో లానే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడని, అందులో ఓ పాత్ర మరింత పవర్ఫుల్ గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకి ‘గాడ్ సే’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది.

Exit mobile version