
అందాల భామ శృతి హాసన్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎన్నికైంది. శృతి కెరీర్ ఫ్లాప్స్ తో మొదలైనప్పటికీ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో సక్సెస్ అందుకొని ప్రస్తుతం సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది.
టైమ్స్ నిర్వహించిన సర్వేలో శృతి హాసన్ తర్వాత స్థానంలో మిల్క్ బ్యూటీ తమన్నా ఉంది. ప్రస్తుతం తమన్నాకి అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో శ్రియ ఉంది. శ్రియ నటించిన మనం సినిమా ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాతి స్థానంలో ఇలియానా ఉంది. వీరందరినీ ఆశ్చర్య పరిచేలా వైజాగ్ గర్ల్ శోభిత ధూళిపాళ ఐదవ స్థానంలో ఉంది.