అనిశ్రీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శిరీష మండవిల్లి నిర్మించిన ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ బుధవారం ఘనంగా జరిగింది. వెంకట కళ్యాణ్ మండవిల్లి సమర్పిస్తున్న ఈ ఆల్బమ్‌కు ఆనంద్ కథ, స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించారు. వేచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ జంటగా నటించిన ఈ పాటను మే 1న ‘క్రేజీ ఎన్ క్యాచీ’ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్ అంబటి మాట్లాడుతూ.. పాట, వర్ధన్ సంగీతం చాలా బాగున్నాయని, కృష్ణ-రిద్ధి జంట ఆకట్టుకునేలా ఉందని ప్రశంసించారు. సింగర్ సాకేత్, రాంబాబు గోసాల మాట్లాడుతూ.. ఈ పాట ఘన విజయం సాధించి సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వర్ధన్ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ పాట కోసం ఏడాది పాటు శ్రమించామని మ్యూజిక్ డైరెక్టర్ వర్ధన్, డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. తమకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, సహకరించిన బృందానికి నటీనటులు కృతజ్ఞతలు తెలియజేశారు. సింగర్స్ పవన్ కళ్యాణ్, అనన్య భాస్కర్, లిరిక్ రైటర్ మల్లిక వల్లభ పిట్ల తమ సంతోషాన్ని పంచుకుంటూ ప్రేక్షకులు పాటను ఆదరించాలని కోరారు.
