
‘ఆగడు’ సినిమా చిత్రీకరణ చివరదశకు చేరుకోవడంతో మహేష్ బాబు తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ‘ఆగడు’ తర్వాత ‘మిర్చి’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించబోయే సినిమాలో నటించనున్నారు.
ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న ప్రముఖ సిని నిర్మాత అశ్వినీదత్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ… ‘ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్నది తెలుగు ప్రజలేనని అందువల్ల సినిమా పరిశ్రమ ఎక్కడున్నా ఒక్కటేనని, ప్రస్తుతానికి సినిమా పరిశ్రమ విడిపోలేదని స్పష్టం చేశారు. నవంబర్ నుంచి మహేష్ బాబు హీరోగా నిర్మించబోయే కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని’ తెలిపారు.