అక్కినేని అఖిల్ మనసులో ఎవరున్నారు..?

Akhil_Akkineni
అక్కినేని కుటుంబం నుండి మరో వారసుడు తెరంగేట్రం చేయడానికి రంగం సిద్దమయ్యింది. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ సినిమా ఎంట్రీపై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అఖిల్ తోలి సినిమాకు దర్శకత్వం వహించేది ఎవరు..? అనే విషయంపై మీడియాలో విస్తృతంగా చర్చ కూడా జరుగుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీను వైట్ల, దేవా కట్టా, కృష్ణవంశి ఇలా పలువురు పేర్లు వినిపించాయి. వీటిపై కొంచం క్లారిటీ ఇచ్చారు దర్శకుడు దేవా కట్టా.

‘అఖిల్‌కి నేను ఒక ప్రేమకథ చెప్పాను. నా తరహా ఇంటెన్స్ యాక్షన్, లవ్ మిళితం చేసిన కథ. తనకు నచ్చింది. తను వేరే కథలు కూడా వింటున్నాడు. తన తోలి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఎవరికి ఇస్తాడో ముందే చెప్పలేను’ అని దేవా కట్టా వ్యాఖానించారు. ఇప్పుడు అఖిల్ మనసులో ఎవరు ఉన్నారు..? మిగతా ఇద్దరు దర్శకులు ఎవరు అనే కొత్త చర్చ మొదలైంది. మరికొన్ని రోజులలో ఈ సస్పెన్స్ కి తెరపడనుంది.

Exit mobile version