మహేష్ అభిమానుల లిస్టులో మరో హిందీ హీరోయిన్.

mahesh-parinithi-chopra
సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఉందంటూ ఇప్పటికే పలువురు హిందీ హీరోయిన్లు తమ మనసులో మాటను బాహాటంగా వెల్లడించారు. దీపిక పదుకొనె, కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా వంటి బాలీవుడ్ తారలు తెలుగులో మహేష్ బాబు సరసన అవకాశం వస్తే సినిమా చేస్తాం అంటూ ప్రకటించారు. వీరందరికీ మహేష్ అంటే ఎంత అభిమానమో ఆ స్టేట్మెంట్ బట్టి అర్ధం చేసుకోవచ్చ. ఈ లిస్టులో మరో యువ హిందీ హీరోయిన్ చేరిపోయింది.

ప్రియాంక చోప్రా కజిన్ గా హిందీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యెక గుర్తింపు తెచ్చుకుంది పరిణితి చోప్రా. పేస్ బుక్ లో అభిమానులతో క్వశ్చన్ & ఆన్సర్ కార్యక్రమం నిర్వహించిన పరిణితి.. సౌత్ సినిమాలలో మీ ఫేవరెట్ హీరో ఎవరు..? అని అడిగిన ప్రశ్నకు ‘మహేష్ బాబు & రజిని సర్’ అంటే నాకు చాలా ఇష్టం అంటూ సమాధానం ఇచ్చింది.

Exit mobile version