
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు శ్రీ కారం చుట్టిన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గోపాల గోపాల’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో వెంకటేష్ చేస్తున్న మిడిల్ క్లాస్ పాత్రని చాలా చాలెంజింగ్ గా తీసుకొని చేస్తున్నానని వెంకటేష్ అన్నాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘ మామూలుగా నేను ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తిని, కానీ ‘గోపాల గోపాల’లో ఏమాత్రం ఆధ్యాత్మిక భావనలు లేని పాత్ర పోషిస్తున్నాను. అదే నాకు చాలెంజింగ్ గా అనిపించి ఈ పాత్ర చేస్తున్నాను. ఆ పాత్ర చేస్తున్నప్పుడు కూడా కొత్త అనుభూతి కలుగుతోంది. త్వరలోనే నేను – పవన్ కలిసి నటించబోయే సీన్స్ షూట్ చేస్తాం. ఆ సీన్స్ అన్నిటిని చాలా బాగా రాసారని’ వెంకటేష్ అన్నాడు.
‘గోపాల గోపాల’ కాకుండా వెంకటేష్ నటించిన మళయాళ రీమేక్ ‘దృశ్యం’ సినిమా జూలై 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేసుకుంటోంది.