
సెక్సీ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న తోలి తెలుగు సినిమా ‘కరెంటు తీగ’. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ టీచర్ పాత్రలో నటిస్తుంది. ఈ రోజు నుండి ‘కరెంటు తీగ’ తాజా షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. సన్నీ లియోన్, మంచు మనోజ్ లపై స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నారు. గత వారమే సన్నీ లియోన్ పాల్గొనగా కీలకమైన కామెడీ సన్నివేశాలు చిత్రీకరించారు.
‘ఈ రోజు నుండి సన్ని లియోన్ తో సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. సూపర్ కామెడీ టైం ఎట్ సెట్స్ ‘ అంటూ మంచు మనోజ్ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పేర్కొన్నారు. ఇటివలే సన్నీ లియోన్ మంచు మనోజ్ పై పొగడ్తల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీ లియోన్ నటించిన హిందీ సినిమా ఐటెం సాంగ్ పింక్ లిప్స్ యుట్యూబ్లో రికార్డులు సృష్టిస్తుంది. ‘కరెంటు తీగ’ సినిమాకు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో క్రేజ్ రావడం ఖాయం.
మనోజ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు జి. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. మంచు విష్ణు నిర్మాత.