
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘ఆగడు’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో కామెడీ ఎక్కువగా ఉండనుంది. మామూలుగా శ్రీను వైట్ల తన సినిమాల్లో బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణలకు స్పెషల్ రోల్స్ క్రియేట్ చేస్తాడు. కానీ ఆగడు లో మాత్రం బ్రహ్మానందంతో పాటు పోసాని కృష్ణ మురళికి ఒక స్పెషల్ పాత్రని క్రియేట్ చేసారు.
ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – పోసాని కృష్ణమురళి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, అవి సినిమాకి స్పెషల్ హైలైట్ అవుతాయని అంటున్నారు. మహేష్ బాబు మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ చిఎన్మకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.