మాస్ కమర్షియల్ యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో తన కుమారుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘అల్లుడు శీను’. ఇటివల విడుదలైన ఆడియో శ్రోతల నుండి మంచి స్పందన సొంతం చేసుకుంది. దేవి శ్రీ సంగీతం సినిమాపై అంచనాలను పెంచేసింది. కొత్త హీరో సరసన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించడం, తమన్నా స్పెషల్ సాంగ్, వినాయక్ దర్శకత్వం ‘అల్లుడు శీను’కు క్రేజ్ తీసుకొచ్చాయి. వీటిని మాక్సిమం క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు నిర్మాత సురేష్.
కుమారుడి తోలి సినిమా కావడం చాలా భారి ఖర్చుతో నిర్మించారు. పెట్టిన పెట్టుబడి తిరిగిరావాలంటే ఓపెనింగ్స్ చాలా కీలకం. అందుకే సినిమా పబ్లిసిటీ భారి ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి సినిమాతో కుమారుడికి గట్టి పునాది వేయాలని భావిస్తున్నారు. త్వరలో పబ్లిసిటీ ప్రారంభించనున్నారు.
