
ఎనర్జిటిక్ హీరో రామ్ తో చేసిన ‘కందిరీగ’ సినిమాతో తెలుగు చినీఎ పరిశ్రమకు పరిచయమైన మరో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. ఈ సినిమా సక్సెస్ తో ‘కందిరీగ’ శ్రీనివాస్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా ‘రభస’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు 14న విడుదల కానుంది.
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో సంతోష్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా రెడీ చేసుకున్న సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమాకి ‘తిక్కరేగితే’ అనే టైటిల్ ని ఖరారు చేసాడు. కానీ ఈ సినిమాలో నటించనున్న హీరో, హీరోయిన్ మరియు నిర్మాత ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ విషయాలను ‘రభస’ రిలీజ్ తర్వాత అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో ఎవరికి ఈ ‘తిక్కరేగితే’ టైటిల్ వెళుతుందో చూడాలి..