
తనికెళ్ళ భరణి త్వరలో ‘భక్త కన్నప్ప’ సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాను హీరో సునీల్ తో తెరకెక్కించే పనిలో వున్నట్టు సమాచారం. ఈ పాత్రకి, సునీల్ శరీరాకృతికి సరిగ్గా సరిపోయిందని చెప్పుకొస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని దాదాపు సంవత్సరం పాటు తెరకెక్కించే యోచనలో వున్నట్టు, ఈ సినిమా 2016కి రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం
భరణి గతంలో తీసిన ‘మిధునం’ సినిమా విమర్శకులను మెప్పించి ఒక క్లాసిక్ పిక్చర్ గా నిలిచింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ పేరుతోనే ఆయన కెరీర్ తొలినాళ్ళలో సినిమా తీసి హిట్ కొట్టినవిషయం తెలిసినదే. మరి ఇప్పుడు సునీల్ తో భరణి మరోసారి హిట్ కొడతాడా లేడా అన్నది చూడాలి