‘ఐస్ క్రీం-2’లో హీరోయిన్ గా ప్రీతి రానా..?

ice-cream-2
‘ఆ ఐదుగురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రీతి రానా. తోలి సినిమాతో అంతగా గుర్తింపు పొందని ఈ ముంబై భామపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దృష్టి పడింది. కొన్ని రోజుల క్రితం కలిసుంటే ‘రౌడీ’లో హీరోయిన్ గా తీసుకునేవాడిని అని కాంప్లిమెంట్ ఇచ్చారట. దాంతో ప్రీతి రానా ఆనందానికి అవధాలు లేవు. మంచు విష్ణు హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ’12’ సినిమాలో చిన్న అవకాశం ఇచ్చారు. నా తదుపరి సినిమాలో నువ్వే హీరోయిన్ అని వర్మ ప్రామిస్ చేసారని ప్రీతి రానా చెప్తుంది.

‘ఐస్ క్రీం-2’లో హీరోయిన్ గా ప్రీతి రానా సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రొడక్షన్ యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ప్రీతి రానా ఆది ‘గాలిపటం’ సినిమాలో కూడా చిన్న రోల్ లో నటించింది. మరో కన్నడ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

Exit mobile version