తన మంచితనాన్నిచూపించిన యెన్. టి. ఆర్

rabasa
ప్రస్తుతం చాలామంది సెలబ్రిటీలు సామజిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ విషయాలకి మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది. కాని కొంతమంది నటీనటులు పబ్లిసిటీకి దూరంగా వుంటారు. అటువంటి కొంతమంది వ్యక్తుల్లో యెన్. టి. ఆర్ ఒకరు.

యెన్. టీ. ఆర్ చేసిన ఒక మంచి పని ఒకటి మాకు తెలిసింది. కొన్ని వారల క్రితం యెన్. టి. ఆర్ దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి తండ్రికి వొంట్లో బాగోకపోవడంతో చాలా కష్టాల్లో వున్నాడు. ఈ విషయం తెలుసుకున్నయెన్. టి. ఆర్ కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఆ పెద్దాయనని కలసి మూడు లక్షల రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చారు. ఇప్పుడు అతను కోల్కుంటున్నారు. అంతేకాకుండా తన స్టాఫ్ పిల్లలకి చదువు కోసం ఆర్ధిక సహాయం చేస్తున్నాడని సమాచారం.
తారక్ ని సినిమా ప్రేమికులతో పాటు అతని అభిమానులు కూడా అభినందిస్తున్నారు. వే టు గో తారక్.

Exit mobile version