నేటి నుంచి భాగ్యనగరంలో గోవిందుడి న్యూ షెడ్యూల్

govindudu-andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గోవిందుడుఅందరివాడేలే’. గత వారమే ఈ చిత్ర టీం పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది నాలుగు రోజులు గ్యాప్ తీసుకున్న ఈ చిత్ర టీం నేటి నుంచి తాజా షెడ్యూల్ ని హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు కీలక నటీనటులు కూడా షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం నానక్రాంగూడాలో వేసిన ఓ స్పెషల్ సెట్లో కొన్ని సీన్స్ మరియు పాటలను కూడా షూట్ చేసారు. ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నారు. రామ్ చరణ్ పోనీ టెయిల్, స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. కృష్ణవంశీ డైరెక్టర్.

Exit mobile version