‘ఒక లైలా కోసం’ సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా ఉన్న టీం

Oka-Laika-Kosam
అక్కినేని యువ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ఒక లైలా కోసం’. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కుమార్ కొండ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నాగ చైతన్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానుంది.

ఈ సినిమా విజయంపై ఈ చిత్ర టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నాగ చైతన్య ఈ సినిమా తన కెరీర్లో మరి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే సినిమా అవుతుంది అంటున్నాడు. విజయ్ కుమార్ కొండ ఈ సినిమా యూత్ నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుందని అంటున్నాడు. ఇకపోతే నాగార్జున చైతన్యని మరోమెట్టు పైకెక్కించే సినిమా అవుతుందని అంటున్నారు. ఈ విధంగా టీంలోని అందరూ ఈ సినిమా విజయంపై ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో నిన్ననే ఒక లైలా కోసం సక్సెస్ మీట్ ని జరిపారు. మరి ఈ చిత్ర టీం అనుకుంటున్నట్లు ‘ఒక లైలా కోసం’ బాక్స్ ఆఫీసు విజేతగా నిలుస్తుందో లేదో అనే దానికోసం అక్టోబర్ 17 వరకూ ఎదురు చూడాల్సిందే..

Exit mobile version