
ప్రస్తుతం ఆకాష్ వయసు 17 ఏళ్ళు మాత్రమే, నాలుగేళ్ల తర్వాత పూర్తి స్థాయి(ఫుల్ లెంత్) హీరోగా ఎంట్రీ ఉంటుంది. అని అన్నారు ప్రముఖ దర్శకులు పూరి జగన్నాధ్. ‘టైంపాస్’ సినిమాతో ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్నాడు అని వస్తున్న వార్తలపై పూరి స్పందించారు.
మరాఠీ సినిమా ‘టైంపాస్’ రీమేక్ లో ఆకాష్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కాని, హీరోగా అది అతని ఫస్ట్ మూవీ కాదు. అని పూరి జగన్నాధ్ చెప్పారు. టీనేజ్ ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రసాద్ లాబ్స్, ఐమాక్స్ అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ‘రుషి’ ఫేం రాజ్ ముదిరాజ్ దర్శకుడు. ఆకాష్ సరసన సూట్ అయ్యే టీనేజ్ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. కొంత గ్యాప్ తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా ఇది.
Ramakrishna • Now