బేబీ బాయ్ కి తండ్రైన గోపీచంద్

gopichand
టాలీవుడ్ మాచో హీరో గోపీచంద్ ‘లౌక్యం’ సినిమా మంచి విజయం సాధించడంతో చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ విజయం కన్నా వందరెట్లు ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చే సంఘటన ఈ రోజు గోపీచంద్ లైఫ్ లో చోటు చేసుకుంది. అదే గోపీచంద్ త్రండ్రి అవ్వడం. ఈ రోజు గోపీచంద్ దంపతులకు పండంటి మగ బిడ్డ(బేబీ బాయ్) పుట్టాడు. ఈ విషయం గోపీచంద్ మరియు అతని కుటుంబసభ్యులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

గత సంవత్సరమే గోపిచంద్ హీరో శ్రీకాంత్ కి బంధువులైన రేష్మని పెళ్లి చేసుకున్నారు. గోపీచంద్ లైఫ్ లో మరచిపోలేని రోజుగా ఈ రోజు మిగిలిపోతుంది. ఈ సందర్భంగా గోపీచంద్ మరియు అతని కుటుంబసభ్యులకు 123తెలుగు. కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Exit mobile version