సస్పెన్స్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ ‘కార్తికేయ’ – నిఖిల్

karthikeya
ఈ సంవత్సరం దీపావళి కానుకగా ప్రేక్షకులకు మీము ఇస్తున్న కానుక ‘కార్తికేయ’. స్వాతి, నేను జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతుంది. సస్పెన్స్ తో కూడిన కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. పక్కా కమర్షియల్ సినిమా. అని అన్నారు యువ హీరో నిఖిల్. ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ బ్యానర్ పై వెంకట్ శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించడానికి చిత్ర బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిఖిల్, స్వాతి, చందు మొండేటి, వెంకట్ శ్రీనివాస్ బొగ్గరం మరియు నైజాం డిస్ట్రిబ్యూటర్ లు పాల్గొన్నారు.

అనంతరం నిఖిల్ మాట్లాడుతూ… ‘కార్తికేయ’ ట్రైలర్ లకు విశేష స్పందన లభించింది. ప్రేక్షకులు ఎక్కడ కనిపించినా సినిమా ఎప్పుడు విడుదల చేస్తున్నారు అని అడుగుతున్నారు. సరైన విడుదల తేది కోసం ఇన్ని రోజులు ఎదురుచూశాం. ఈ నెల 24న తెలుగు, తమిళ భాషలలో విడుదల చేస్తున్నాం. చందు మొండేటి చాలా చక్కగా సినిమాను రూపొందించాడు. నా చివరి సినిమా ‘స్వామి రా రా’ నైజాంలో 130 స్క్రీన్ లలో విడుదల అయ్యింది. ‘కార్తికేయ’ దానికి రెట్టింపు థియేటర్లలో, సుమారు 250 స్క్రీన్ లలో విడుదల కానుండడం అనందంగా ఉంది. సినిమా విజయం సాదిస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.

దర్శకుడు చందు మొండేటి మాట్లడుతూ… కార్తీక మాసం మొదటి రోజున, దీపావళికి ఒక్క రోజు ముందు మా సినిమా విడుదలవుతుంది. సస్పెన్స్, కామెడీ థ్రిల్లర్ జోనర్ లో సినిమా తెరకెక్కించాం. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. అని అన్నారు.

నిర్మాత వెంకట్ శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ… ట్రైలర్స్ చూస్తే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలుస్తుంది. డిఫరెంట్ స్టొరీ, స్క్రిప్ట్ తో తెరకెక్కిన సినిమా ‘కార్తికేయ’. భగవంతుడికి మరియు సైన్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉంది అనే అంశాన్ని దర్శకుడు చందు సినిమాలో చాలా చక్కగా చూపించాడు. సినిమా 24న విడుదల చేస్తున్నాం. పైరసీని ప్రోత్సహించకండి, ధియేటర్లో సినిమా చూడండి అని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు.

Exit mobile version