
విక్రమ్ సినిమా వెండితెరపై సందడి చేసి 2015 ఫెబ్రవరికి రెండేళ్ళు అవుతుంది. సుదీర్గ కాలంగా చిత్రీకరణ జరుపుకుంటున్న శంకర్ ‘ఐ’ సినిమా విడుదల కూడా గ్రాపిక్ వర్క్స్ వలన మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. రెండేళ్ళ పాటు తన సినిమాల కోసం ఎదురు చూసిన అభిమానులలో వరుస సినిమాలతో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు విక్రమ్.
‘ఐ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యే సమయంలో మరో సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. ‘గోలీ సోడా’ ఫేం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’10 ఎండ్రదుకుళ్ల’ సినిమా షూటింగును రికార్డు సమయంలో పూర్తి చేశాడు. సమంత ఈ సినిమాలో హీరోయిన్.
భారి అంచనాలు నెలకొన్న ‘ఐ’ సినిమా విడుదల తర్వాత ’10 ఎండ్రదుకుళ్ల’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ‘ఐ’ ట్రైలర్ లో విభిన్న శరీరాకృతిలతో ఆశ్చర్యానికి గురిచేసిన విక్రమ్, ఈ కొత్త సినిమాలో సరికొత్త లుక్ లో దర్శనం ఇవ్వనున్నాడట.