
”లింగ” వంటి భారీ సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఆ చిత్ర విడుదలకు ఒక్కరోజు ముందు తన అభిమాన దర్శకుడు సుకుమార్ అని తెలిపాడు. తమిళ వెబ్ సైట్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సుకుమార్ ఒక అద్భుతమైన రచయిత మరియు దర్శకుడు అని, ఒకే స్క్రిప్ట్ తో పలు వెర్షన్ లను తీసుకురాగల సమర్ధుడని తెలిపాడు. చిత్రాన్ని గ్రాండ్ విజువల్స్ తో నింపగల క్రియేటివిటీ ఆయనలో వున్నట్టు అభిప్రాయపడ్డాడు
తనకు సుకుమార్ తో మంచి బంధం వుందని. ఆర్య, జగడం ఇటీవల ‘1 నేనొక్కడినే’ సినిమాలకు తాను సినిమాటోగ్రాఫర్ గా పనిచేసినట్టు తెలిపాడు. ‘1 నేనొక్కడినే’ సినిమాలో తీసిన కొన్ని విజువల్స్ చూసి మహేష్ బాబు ఆశ్చర్యపోయాడని చెప్పారు. సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘కుమారి 21F’కి కూడా రత్నవేలే కెమరామెన్ కావడం గమనార్హం