
లెజెండరీ దర్శకుడు బాపు సినిమాలంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఒక విందు భోజనంలా వుంటుంది. తెలుగుదనం ఉట్టిపడేలా క్లాస్ సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన చిత్రరాజ్యాన్ని అమరం చేయడానికి ఈ నెల 15నుండి 21 వరకూ బాపూ ఫిలిం ఫెస్టివల్ పేరుతొ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహిస్తున్నారు. బాపుకి అంకితమివ్వడానికి అతని సినిమాలే సరైన కొలమానమని హైదరాబాద్ ఫిలిం క్లబ్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు
ఈ ఫిలిం ఫెస్టివల్ ని నేడు సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల మరియు సుమంత్ తో సహా ఫిలిం సెలబ్రిటీల నడుమ లాంచనంగా ప్రారంభమైంది