‘వారియర్’ గా బాలకృష్ణ?

balakrishna
కొత్త దర్శకుడు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ లో బాలకృష్ణ బిజీ గా వున్నారు. ఈ చిత్రం టైటిల్ కోసం ఎన్నో పేర్లు పరిశీలనకి రాగా నిర్మాతలు ‘వారియర్’ అనే పేరుని ఖరారు చేసారని సమాచారం. అయితే అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి వుంది.

త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. మణి శర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రుద్రపాటి రమణ రావు నిర్మిస్తున్నారు

Exit mobile version