స్టైలిష్ ‘బందిపోటు’గా అల్లరి నరేష్..

allari-naresh

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బందిపోటు’. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలో నిర్మాణంతర కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ రోజు ‘బందిపోటు’ సినిమాలో కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. ఇవి సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపాయి. అల్లరి నరేష్ స్టైలిష్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అల్లరోడు నటించిన ఇతర సినిమాలకు భిన్నంగా చాలా అందంగా ఈ స్టిల్స్ లో అందంగా కనిపించాడు. గత సినిమాలు ఆశించిన విజయాని అందించకపోవడంతో ఈ సినిమాపై నరేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

నరేష్ సరసన ‘అంతక ముందు ఆ తర్వాత’ ఫేం ఈషా జంటగా నటించిన ఈ సినిమాలో, శ్రద్ధా దాస్ ప్రత్యేక పాత్రలో నటించింది. ఓ స్పెషల్ సాంగులో శ్రద్ధా సందడి చేయనుంది. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు. ఇ.వి.వి. సినిమా పతాకంపై ఆర్యన్ రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version