‘గోపాల గోపాల’తో పోటీ పడనున్నా శంకర్ ‘ఐ’?

gopala-gopala-i
ఈ సంవత్సరమంతా ఎక్కువగా ఎదురుచూసిన చిత్రాలలో శంకర్ ‘ఐ’ చిత్రం ఒకటి. ఈ ఏడాది దసరాని పురస్కరించుకుని విడుదలకావాల్సివున్నా పోస్ట్ ప్రొడక్షన్ పనుల జాప్యం వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే తమిళ వెర్షన్ ఆడియో లాంచ్ గ్రాండ్ స్కేల్ లో జరగడం, పాటలన్నీ చార్ట్ బస్టర్లుగా నిలవడం, ఆ సందర్భంలో విడుదలచేసిన ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సినిమా పై అంచనాలు పెరిగాయే తప్ప అనువంతైనా తగ్గలేదు. ఆఖరికి ఈరోజు విడుదలైన హిందీ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది

అయితే దాదాపు అన్ని పనులను ముగించుకుని, సెన్సార్ వారి నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ కూడా పొందిన ఈ చిత్రం నిన్నటివరకూ జనవరి 9న విడుదల ఖరారు అనుకున్నా కొన్ని అనుకోని కారణాల వలన ఈ విడుదల జనవరి 14కి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ లు జరగకపోవడం కూడా ఈ కారణాలలో ఒకటి. అయితే అదేరోజున మరోభారీ మల్టీ స్టారర్ ‘గోపాల గోపాల’ విడుదల కూడా వుండడంతో ఈ రెండు చిత్రాల మధ్యా పోటీనెలకొనే పరిస్థితి కనిపిస్తుంది.

అయితే ఈ ప్రకటన ఇంకా అధికారికంగా వెలువడలేదు. మరిన్ని వివరాల కోసం మా సైట్ చదువుతూ వుండండి

Exit mobile version