
విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ ఆడియో విడుదల కార్యక్రమం అమెరికాలో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్నాయి. ఫేమస్ ఇంటర్నేషనల్ టెక్నీషియన్లు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. కమల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరి రెండవ వారంలో ఆడియో విడుదలను అమెరికాలో భారి ఎత్తున నిర్వహించడానికి నిర్మాతలు సిద్దంగా ఉన్నారని చెన్నై మీడియా టాక్.
నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియాలు హీరోయిన్లుగా నటించారు. స్వర్గీయ బాలచందర్, కె.విశ్వనాధ్ వంటి ప్రముఖ దర్శకులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, లింగుస్వామి తిరుపతి బ్రదర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించాయి. కథ, స్క్రీన్ ప్లే, మాటలను కమల్ అందించారు. జిబ్రాన్ సంగీత దర్శకుడు.