దాసరికి అరుదైన పురష్కారం

Dasari

టాలీవుడ్ దిగ్గజ దర్శకులలో ఒకరు, విలక్షణ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఇప్పటి వరకూ ఎన్నో అవార్డులను అందుకున్నాడు. తాజాగా దాసరికి మరో అరుదైన గౌరవం దక్కింది. అదే స్వర్గీయ శోభన్ బాబు గుర్తుగా ఆయన ప్రతి పుట్టిన రోజుకు ఇచ్చే ‘స్వర్ణ కంకణం’ అవార్డు ని ఈ సంవత్సరం దాసరికి ఇవ్వనున్నారు. తెలంగాణ సేవ సమితి – శ్రుతిలయ ఆర్ట్స్ అకాడమీ కలిసి ఇవ్వనున్న ఈ అవార్డు కార్యక్రమం జనవరి 10న హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరగనుంది.

ఈ విషయంలో దాసరి నారాయణరావు ఎంతో ఆనందపడుతూ ‘శోభన్ ఎంతో టాలెంట్ ఉన్న నటుడు, అంతకన్నా గొప్ప వ్యక్తి. తెలుగు సినీ ప్రేమికుల్లో ఆయన చెరగని ముద్రని వేసుకున్నారు. ఈ అవార్డు నాకు దక్కినందుకు చాలా ఆనందంగా ఉందని’ అన్నారు. దాసరి గారికే కాకుండా కమెడియన్ శివ రెడ్డికి శోభన్ బాబు మెమోరియల్ అవార్డును బహుకరించనున్నారు.

Exit mobile version