
సినిమా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పట్టం కడుతూ.. తారల తళుకు బెళుకులు.. మధ్య గత ఏడాది దుబాయిలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గామా అవార్డుల వేడుక ఈ ఏడాది అంతే అందంగా ముస్తాబయింది. ఫిబ్రవరి 6న దుబాయిలో జబీన్ పార్క్ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం భారి ఎత్తున జరగనుంది. అని గామా చైర్మెన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.
సినిమా రంగానికి ఎనలేని సేవలను అందించిన ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాధ్ కు గామా జీవన సాపల్య పురస్కారం అందజేస్తున్నట్టు చెప్పారు. 2014 సంవత్సర అవార్డుల వేడుకలో ఆయనను సత్కరిస్తున్నట్టు తెలియజేశారు. గత ఏడాది ఈ పురస్కారాన్ని బాపు గారికి అందజేశారు.
మురళి మోహన్, కృష్ణం రాజు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బ్రహ్మానందం, సంగీత దర్శకులు కోటి, అల్లరి నరేష్, శర్వానంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సలోని, సదాల స్పెషల్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలీ, సుమ యాంకర్లుగా వ్యవహరిస్తారు. అని కేసరి త్రిమూర్తులు తెలిపారు.