‘సైజ్ జీరో’లో అనుష్క డ్యూయల్ రోల్..?

anushka1 (1)
‘రుద్రమదేవి’, ‘బాహుబలి’ సినిమాల తర్వాత బెంగుళూరు యోగా బ్యూటీ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా ‘సైజ్ జీరో’. రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు’ ఫేం ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుష్క రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కన్పిస్తుందని యూనిట్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

అనుష్క సరసన తమిళ నటుడు ఆర్య హీరోగా నటిస్తున్నారు. ‘వర్ణ’ తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా ఇది. శృతి హాసన్ అతిథి పాత్ర ‘సైజ్ జీరో’కు ప్రత్యేక ఆకర్షణ. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పోట్లురి నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సినిమాను నిర్మించనున్నారు.

Exit mobile version