
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సినిమా అంటేనే సున్నితమైన భావోద్వేగాలకు పెట్టిన పేరు. ఎప్పటికప్పుడు సెన్సిబుల్ సినిమాలను నిర్మిస్తూ తన సంస్థకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చారు దిల్‌రాజు. తాజాగా ఆయన ‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ సినిమాలతో సెన్సిబుల్ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్ అడవితో ‘కేరింత’ పేరుతో ఓ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే! సుమంత్ అశ్విన్, శ్రీదివ్య హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ శుక్రవారమే విడుదలకు సిద్ధమైంది.
ఇక ఈ సినిమా కోసం దిల్‌రాజు చేపట్టిన ప్రమోషనల్ కార్యక్రమాలు వినూత్నంగా ఉండడమే కాక అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు టార్గెట్ ఆడియన్స్ యూత్ కావడంతో సెలవు రోజులు, సాయంకాలం యూత్ ఎక్కువగా గడిపే పలు షాపింగ్ మాల్స్‌లలో సినిమా యూనిట్ ప్రచారాలు సాగిస్తున్నారు. హైద్రాబాద్, వైజాగ్ ఇలా పలు ప్రధాన నగరాలలో చేపట్టిన ప్రమోషన్లు సినిమాకు మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఇప్పటికే మిక్కీ.జే.మేయర్ అందించిన పాటలు మంచి హిట్‌గా నిలిచి సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా? అనేది తెలియాలంటే జూన్ 5 వరకూ ఆగాల్సిందే!