
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో నితిన్‌తో ప్లాన్ చేసిన సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే! ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తై, ఈ నెల 15న సెట్స్‌పైకి వెళ్ళాల్సిన సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. నితిన్ సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలియజేస్తూ ఇదే కథను వేరే హీరోతో తెరకెక్కించనున్నట్టు తెలియజేసినట్టుగానే పూరీ జగన్నాథ్ ఓ మెగా ఫ్యామిలో హీరోతో ఈ సినిమా చేయనున్నారు.
‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించనున్నారు. నిజానికి పూరీ, వరుణ్ తేజ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉండగా అది కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ ఇలా కలవడం ఆసక్తికరంగా మారింది. ఈనెల్లోనే ఈ సినిమా లాంచ్ కానున్న ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించనున్నారు.. ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జ్యోతిలక్ష్మీ’ రేపు పెద్ద ఎత్తున విడుదల కానుంది.