మరో ఆసక్తికర టైటిల్‌తో సాయి ధరమ్ తేజ్ సినిమా?

sai-dharam-tej
‘పిల్లా.. నువ్వులేని జీవితం’ అంటూ తన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సాయిధరమ్ తేజ్, ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు ఈ సినిమాకు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించబోయే సినిమా గురించి అప్పుడే ప్రచారం మొదలైంది.

సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ దిల్‌రాజుతో మరో సినిమా చేసేందుకు సిద్ధమైపోయారట. ‘సంతానం భవతి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో ‘గబ్బర్ సింగ్’, ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే సహకారం అందించిన వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Exit mobile version