రేపు ‘రుద్రమదేవి’ తమిళ ట్రైలర్ లాంచ్!

Rudrama-devi
గుణశేఖర్ కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చారిత్రక సినిమా ‘రుద్రమదేవి’. ఈ సినిమాలో రుద్రమదేవి పాత్రను అనుష్క పోషించగా, మరో ప్రధాన చారిత్రక గోనగన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించారు. హీరో రానా, నిత్యామీనన్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 26న విడుదల కానున్న విషయం తెలిసిందే! ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఆడియోతో సినిమా పట్ల అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యాజిక్ పాటల్లో కనిపించిందని ఆడియో ద్వారా ఇప్పటికే ఋజువైంది.

ఇక రేపు ఈ సినిమా తమిళ వర్షన్‌కు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఇళయరాజా చెన్నైలో విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరగనుంది. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా తెరకెక్కిన స్టీరియోస్కోపిక్ 3డీ బయోపిక్ కావడంతో ఈ సినిమాపై సౌత్ తమిళ, మళయాలంలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగుతో పాటే తమిళ, మళయాల వర్షన్‌లు ఒకేసారి విడుదల కానున్నాయి.

Exit mobile version