స్క్రిప్ట్ పనులతో బిజీగా వున్న ‘జిల్’ దర్శకుడు

Radha-Krishna
గోపీచంద్ తో ‘జిల్’ సినిమా తీసి విజయం సాదించిన దర్శకుడు రాధాకృష్ణ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా వున్నాడు. తాను రాసుకున్న కధకు తుదిమెరుగులు దిద్దుతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు మరియు ఇతర వివరాలను ఈ నెలాఖరుకి తెలుపనున్నట్టు సమాచారం.

ఈ చిత్రాన్ని కూడా యు.వి క్రియేషన్స్ సంస్థ నిర్మించడం విశేషం. రన్ రాజా రన్, మిర్చి, జిల్ సినిమాలతో ఈ సంస్థ హ్యాట్ ట్రిక్ సాధించింది. ప్రస్తుతం నాని భలే భలే మగాడివోయ్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది.

Exit mobile version