‘బాహుబలి’ టీంపై సురేష్ సెన్సేషనల్ కామెంట్స్

Suresh
ఒకప్పుడు హీరోగా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించిన నటుడు సురేష్ కి మంచి గుర్తింపే ఉంది. ప్రస్తుతం సురేష్ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేస్తున్నాడు. సోషల్ మీడియా అయిన ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సురేష్ గత రాత్రి అందరూ షాక్ అయ్యేలా కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు. అది కూడా యావత్ భారతదేశం ఎదురు చూస్తున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’పై కామెంట్స్ చేసాడు.

ఇక ఏమన్నాడు అనే విషయానికి వస్తే.. ‘నేను బాహుబలి మరియు ఎస్ఎస్ రాజమౌళిని సపోర్ట్ చెయ్యను.. ఎందుకంటే జగపతి బాబు లేదా సుమన్ లేదా సాయికుమార్ లాంటి వారు బాహుబలిలోని పాత్రలు చేయడానికి పర్ఫెక్ట్ గా సరిపోతారు కానీ ఆయన అలా ఎందుకు ఆలోచించలేదని’ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ గా మారింది. మరి సురేష్ అడిగిన దానికి బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.. కానీ ఒక డైరెక్టర్ గా తన సినిమాలోని పాత్రలకి తనకు నచ్చిన నటుల్ని సెలెక్ట్ చేసుకునే హక్కు డైరెక్టర్ కి ఉంటుంది కదా.. ఏమంటారు ఫ్రెండ్స్..

Exit mobile version