జెట్ స్పీడ్ లో ‘శ్రీ మంతుడు’ పోస్ట్ ప్రొడక్షన్

mahesh-sri
ఇటీవలే విడుదలైన ‘శ్రీ మంతుడు’ సినిమా ఫస్ట్ లుక్ మరియుఫస్ట్ టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. శ్రీ మంతుడుకి సంబందించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి.

ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు. అనుకున్న రిలీజ్ డేట్ జూలై 17 కల్లా సినిమాని రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం కంటిన్యూగా వర్క్ చేస్తూ సినిమా కార్యక్రమాలను ఫినిష్ చేస్తున్నారు. మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాని ఆడియో రిలీజ్ వేడుకని జూన్ చివర్లో చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version