తన టీంపై అఖిల్ పొగడ్తల వర్షం.!

Akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి త్వరలో హీరోగా పరిచయం కానున్న యంగ్ హీరో అక్కినేని అఖిల్. అఖిల్ నటిస్తున్న మొదటి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాస్ పల్స్ తెలిసిన కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రేష్ఠ్ మూవీ బ్యానర్ పై నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఇటీవలే లాంగ్ స్పెయిన్ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీం మరో అవుట్ డోర్ షెడ్యూల్ కి సిద్దమైంది. థాయ్ లాండ్ లో జరగనున్న ఈ లేటెస్ట్ షెడ్యూల్ ఈ వారంలోనే ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్ర టీం థాయ్ ల్యాండ్ వెళ్లనున్నారు.

ఇదిలా ఉంటే అక్కినేని అఖిల్ తన టీం పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ‘మరో అవుట్ డోర్ షెడ్యూల్ కోసం ఈ వారమే థాయ్ ల్యాండ్ వెళ్తున్నాం. ఈ చిత్ర టీం తో కలిసి పనిచేయడం ఎంత అదృష్టమో మాటల్లో చెప్పలేను. వినయ్ గారు, ఆయన టీం అమేజింగ్. ముఖ్యంగా నిర్మాత సుధాకర్ రెడ్డి గారు, ఆయన టీం ఈ సినిమాకి అసలైన పిల్లర్స్.. ఇప్పటి వరకూ వాళ్ళిచ్చిన సపోర్ట్ కి నా స్పెషల్ థాంక్స్.. త్వరలోనే నేను చెప్పిన వీడియోని రిలీజ్ చేస్తామని’ అఖిల్ ట్వీట్ చేసాడు. ఇప్పటికే చాలా భాగం పూర్తిచేసుకున్న ఈ చిత్ర టీం థాయ్ ల్యాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకొని మరో షెడ్యూల్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లనుంది.

అఖిల్ సరసన సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. అనూప్ రూబెన్స్ – ఎసెస్ తమన్ కలిసి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version