
సినిమా సినిమాకి కొత్తదనం చూపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ కథలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. ఇటీవల అసుర అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెప్పించిన నారా రోహిత్ తన తదుపరి సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ షూటింగ్ ని మొదలు పెట్టాడు. ఇది కాకుండా మరో సినిమాని కూడా ప్రారంభించాడు. ఇప్పటి వరకూ కాస్త బొద్దుగా కనిపించిన నారా రోహిత్ ఇక నుంచి స్లిమ్ లుక్ లో కనిపించడానికి వొర్కొఉత్స్ మొదలు పెట్టాడు.
ఇప్పటి వరకూ మొదలు పెట్టిన సినిమాలు కాకుండా తమిళంలో విజయం సాధించిన ‘మాన్ కరాటే’ సినిమా రీమేక్ లో కూడా నారా రోహిత్ నటించనున్నాడని ఇది వరకే తెలియజేశాం. ఈ సినిమా కోసం నారా రోహిత్ స్లిమ్ గా తయారవుతున్నానని నారా రోహిత్ తెలియజేశాడు. అలాగే ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ బాక్సర్ గా కనపడనని, కొన్ని పార్ట్స్ లో మాత్రమే బాక్సర్ గా కనిపిస్తానని తెలిపాడు. ఇప్పటికే నారా రోహిత్ స్లిమ్ లుక్ కోసం వర్కౌట్స్ కూడా మొదలు పెట్టాడు. సినిమా సినిమాలో కంటెంట్ తో వేరియేషన్ చూపించడమే కాకుండా ఇలా లుక్ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్న నారా రోహిత్ కి మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుందాం..