
‘అవును’ సీరీస్, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘మాయ’ సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ యాక్టర్ హర్షవర్ధన్ రాణే. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్న హర్షవర్ధన్ రాణే ఈ ఏడాది ‘సత్రా కో షాది హై’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకి బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం నిర్మాత. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే హర్షవర్ధన్ రాణే కి బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చింది.
బాలీవుడ్ లో రెండవ ఆఫర్ గురించి హర్షవర్ధన్ మాట్లాడుతూ ‘నా రెండవ బాలీవుడ్ మూవీ త్వరలో లాంచ్ కానుంది. మొదట ముంబై లో షూటింగ్ జరుగుతుంది ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో జరుగుతుంది. దీనికంటే ఎక్కువ సినిమా గురించి చెప్పలేను కానీ ఈ చిత్ర మేకర్స్ నాకు లైఫ్ టైం నిలిచిపోయే పాత్ర ఇచ్చారని’ అన్నాడు. తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఆఫర్స్ దక్కించుకుంటున్న హర్షవర్ధన్ నటించిన అవును 2 సినిమా ఇటీవలే విడుదలై యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది.