చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇన్స్పిరేషన్ గా మారిన అల్లు అర్జున్

nag-anvesh
విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో వెంకటేష్ కొడుకుగా కనిపించిన అందరినీ నవ్వించిన బుడతడు నాగ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ హీరోగా పరిచయం అవుతూ చేస్తున్న సినిమా ‘వినవయ్యా రామయ్యా’. ఈ సినిమా జూన్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
నాగ అశ్విన్ సరసన ‘దృశ్యం’ సినిమాలో వెంకటేష్ పెద్ద కుమార్తెగా కనిపించిన కృతిక జయకుమార్ హీరోయిన్ గా కనిపించనుంది. నాగ అశ్విన్ ని ఎంతో ఇన్స్పైర్ చేసింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

నాగ అశ్విన్ మాట్లాడుతూ ‘ నాకు చిన్నప్పటి నుంచే యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాను. టాలీవుడ్ లో నాకు బాగా నచ్చిన హీరో మరియు నాకు ఎంతో స్పూర్తిని ఇచ్చిన హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ టాలీవుడ్ కి సిక్స్ ప్యాక్ కల్చర్ తో పాటు ఎన్నో కొత్త ట్రెండ్స్ ని పరిచయం చేసారు. ఇలాంటి వాటి గురించే నేను చిన్నప్పుడు కలలు కనేవాడిని. అందుకే ఆయనే నాకు స్ఫూర్తని’ అన్నాడు. మొదటి సినిమా కావడంతో సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ నాగ అశ్విన్ కాస్త నర్వస్ గా ఫీలవుతున్నాడు.
గతంలో ‘సింధూర పువ్వు’ సినిమా అందించిన కృష్ణారెడ్డి తనయుడే నాగ్ అశ్విన్ కావడం విశేషం. జి. రామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, నరేష్, రామరాజు, సప్తగిరి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రాఫర్.

Exit mobile version