మొదటి షెడ్యూల్ ముగించుకున్న చీకటిరాజ్యం.

Kamal-Cheekati-Rajyam
తెలుగు తమిళ భాషలలో ఏకకాలంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న సినిమా ‘చీకటి రాజ్యం’. ఈ సినిమా మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో క్రిందటి నెల మొదలై నేటి వరకూ నిర్విరామంగా కొనసాగింది.

ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంనడుమ కొన్ని ముఖ్య సన్నివేశాలతో సహా ఫ్రెంచ్ స్టంట్ మ్యాన్ నిర్వహణలో యాక్షన్ సన్నివేశాలను సైతం తెరకెక్కించారు. కొన్ని రోజుల విరామం తరువాత రెండవ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభంకానుంది.

ప్రకాష్ రాజ్, సత్యరాజ్ లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్. మధుశాలిని ముఖ్యపాత్రధారి. కమల్ స్నేహితుడు రాజేష్ సెల్వ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version